మేము ఆ మాట అన్నామా?
అందుకే ప్రజాప్రతినిధులపై చులకనభావం: కేటీఆర్ - trs
శంషాబాద్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి కార్తీక్‌రెడ్డి పోటీ చేయనున్నట్లు సమాచారం.
శంషాబాద్‌లో ప్రసంగిస్తున్న కేటీఆర్
నాయకులు పార్టీలు మారడం పట్ల కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కేటీఆర్ ... రాహుల్ గాంధీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఎంతకు కొన్నారని ప్రశ్నించామా అంటూ పేర్కొన్నారు.సారు, కారు, పదహారు, దిల్లీలో సర్కారు దిశగా ముందుకెళ్దామని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో 16 మంది తెరాస లోక్‌సభ సభ్యులను గెలిపిస్తే ఎర్రకోటపై జాతీయ జెండా ఎవరు ఎగరేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించవచ్చని కేటీఆర్ వెల్లడించారు.
ఇవీ చూడండి:మేమూ హిందువులమే: కేసీఆర్