కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్ఐఆర్డీలో జరిగిన 'సుస్థిర గ్రామీణాభివృద్ధి - గ్రామ పంచాయతీల చొరవ'పై అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు.గ్రామీణ సాంకేతిక వనాన్ని సందర్శించడంతోపాటు పర్యావరణహిత గృహాలు, గ్రామీణ ఆవిష్కరణలను తమిళిసై పరిశీలించారు. వినూత్న పథకాలతో ఎన్ఐఆర్డీపీ... గ్రామాలను అభివృద్ధి చేసి, గ్రామస్వరాజ్ సాధించడంలో విజయం సాధించాలని ఆమె కోరుకున్నారు. దేశంలో పుష్కలమైన వనరులు ఉన్నాయని... సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు చేరవేయాలని అధికారులకు సూచించారు.
వినూత్న పథకాలతో గ్రామీణాభివృద్ధి సాధించాలి: గవర్నర్
వినూత్న పథకాలను ప్రవేశపెట్టి గ్రామాలదశను మార్చడంలో ఎన్ఐఆర్టీపీ విజయం సాధించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
వినూత్న పథకాలతో గ్రామీణాభివృద్ధి సాధించాలిః గవర్నర్