తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్ల ఈవీఎం పంపిణీ కేంద్రం వద్ద  సిబ్బంది ఆందోళన

ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చిన అధికారులు ముఖం చాటేశారు. ఎక్కడెక్కడి నుంచో విధులకు హాజరైన సిబ్బంది రాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో.. ఏమి తినాలో.. ఎక్కడ పడుకోవాలో తెలియక నానా తంటాలు పడుతున్నారు. రిజర్వు సిబ్బందిగా వచ్చిన తమను కనీసం అధికారులు తమ బాధలు పట్టించుకోవడం లేదని చేవెళ్ల ఈవీఎం కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.

నిరసన వ్యక్తం చేస్తున్న సిబ్బంది

By

Published : Apr 11, 2019, 5:04 AM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపిణీ కేంద్రం వద్ద ఎన్నికల విధులకు వచ్చిన రిజర్వు సిబ్బంది ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకూ తమకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. సుమారు 200 మందికి పైగా రిజర్వు సిబ్బంది ఉన్నా తమను పట్టించుకోలేదని వాపోయారు. రిటర్నింగ్​ అధికారికి, స్థానిక తహసీల్దారుకు సమాచారం ఇచ్చినా స్పందించలేదనన్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ చెప్తున్న అధికారుల తీరుపై సిబ్బంది నిరసిస్తున్నారు. కేంద్రం వద్ద వేసిన టెంట్లు కూడా తీసివేస్తున్నందున ఈ నడి రాత్రిలో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details