తెలంగాణ

telangana

ETV Bharat / state

RS Praveen Kumar: 'ప్రలోభాలతో రాజ్యాధికారం కొల్లగొడుతున్నారు' - ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar: బహుజనులు 75 ఏళ్లుగా బానిసలుగానే బతుకున్నారని రాష్ట్ర బీఎస్పీ సమన్వయకర్త ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం అనాజ్​పూర్​లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

RS Praveen kumar
ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్

By

Published : May 24, 2022, 4:42 PM IST

ప్రలోభాలతో రాజ్యాధికారం కొల్లగొడుతున్నారు: ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar: విగ్రహాల ఏర్పాటుతో బహుజనుల జీవితాలు మారవని రాష్ట్ర బీఎస్పీ సమన్వయకర్త ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 75 సంవత్సరాలుగా మనం బానిసలుగానే బతుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్లతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​ మెట్ మండలం అనాజ్​పూర్​లో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఎన్నికలు రాగానే మనకు మద్యం, డబ్బులు, చికెన్, మటన్ ఇస్తరు. 75 సంవత్సరాలుగా మనం ఇలాగే బతుకుతన్నాం. దావత్​లు ఇచ్చి మరీ ఓట్లు వేయించుకుంటారు. మహిళలకు పట్టుచీరలు పంచి ఓట్లు కొల్లగొడతారు. మనకు అధికారం రావాలంటే మీరంతా ఏనుగు గుర్తును గెలిపించాలి. -- ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ సమన్వయకర్త

తెరాస ప్రభుత్వంపై ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం బహుజనులను మభ్యపెడతారని ఆరోపించారు. మద్యం, చికెన్, మటన్​ ఇంటికే సరఫరా చేస్తారని మండిపడ్డారు. బహుజన బిడ్డలు ఒక్కసారి ఆలోచన చేసుకుని ఓటు వేయాలని ఆయన కోరారు. బహుజన రాజ్యాధికారం సాధించేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూస్వాముల వర్గాలకే కాంట్రాక్టులు వెళ్లాయని ఆరోపించారు. బహుజన రాజ్యం వస్తే అసైన్డ్​ భూములను పేదలకు పంచుతామని ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details