రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బైరగాని తిరుపతి (28) అనే యువకుడిని గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా హత్య చేశారు. తిరుపతి వృత్తిరీత్యా గీతకార్మికుడు కావడంతో ఆదివారం సాయంత్రం తాటి కల్లు తీసేందుకు వెళ్లగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కల్లు తాగడానికి వచ్చారు. తిరుపతికి వారికి మద్య గొడవ జరిగి మాటామాట పెరగడంతో గీతకార్మికుల కత్తితో హత్య చేసినట్లు పలువురు తెలిపారు.
యువకుడి దారుణ హత్య
ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా నర్సింగాపూర్ గ్రామంలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యువకుడి దారుణ హత్య
ఇది ఇలా ఉండగా తిరుపతికి, అతని బంధువులతో భూ వివాదం జరుగుతుందని వారే హత్య చేసి ఉండవచ్చని గ్రామంలో చర్చలు జరుగుతున్నాయి. తిరుపతికి తల్లి రాజవ్వ, తండ్రి పెద్ద మల్లయ్య, భార్య సహస్ర, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటనాస్థలానికి సీఐ మొగిలి, ఎస్సై సునీల్ చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి: తపాస్పల్లి రిజర్వాయర్లో యువకుడు అనుమానాస్పద మృతి