రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ తన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి సుంకె రవిశంకర్ హాజరయ్యారు. వంద మంది వలస కూలీలకు భోజనం అందించారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
స్వగ్రామానికి ఆపన్నహస్తం అందిస్తోన్న ఎంపీ సంతోశ్‌కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాకలో వలస కార్మికులకు ఎంపీ సంతోశ్‌కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తన స్వగ్రామమైన కొదురుపాకలో నిత్యావసరాలు, భోజనం అందిస్తూ... ఎంపీ దాతృత్వాన్ని చాటుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు.
స్వగ్రామానికి ఆపన్నహస్తం అందిస్తోన్న ఎంపీ సంతోశ్‌కుమార్
30 రోజులుగా వలస కూలీలకు ఎంపీ సంతోశ్ కుమార్ నిత్యం అన్నదానం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వలస కూలీల పట్ల ఎంపీ దాతృత్వం మిగతా వారికి స్ఫూర్తి దాయకమన్నారు. సంతోశ్‌కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌కు విస్తృత ఆదరణ లభించిందని రవిశంకర్ కొనియాడారు.