తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరుత సంచారం..జనాల్లో భయం భయం.. - rajanna sircilla district today news

సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. కొద్ది రోజులుగా పశువులపై దాడులు చేయడం వంటి ఘటనలతో అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత పులి సంచరిస్తున్నట్లుగా కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

leopard-wandering-at-rajanna-sircilla-district
చిరుత సంచారం..జనాల్లో భయం భయం..

By

Published : Feb 12, 2020, 10:38 AM IST

Updated : Feb 12, 2020, 10:49 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత కొద్ది రోజులుగా పశువులపై దాడులు చేయడం వంటి ఘటనలతో అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత పులి సంచరిస్తున్నట్లుగా నిర్ధరించారు.

సమీప గ్రామాల ప్రజలు భయపడాల్సిందేమీ లేదని, మనుషులపై చిరుతలు దాడులు చేయవని, జంతువులపై మాత్రమే దాడులు చేస్తాయని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

చిరుత సంచారం..జనాల్లో భయం భయం..

ఇదీ చూడండి :చౌరస్తాలో సినిమా షూటింగ్​ ప్రారంభం

Last Updated : Feb 12, 2020, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details