రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి, చిన్న లింగాపూర్ తదిరత గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సమయానికి అధికారులు ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం - Crops Drained In Sudden Rain In Rajanna Siricilla
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
TAGGED:
అకాల వర్షానికి తడిసిన ధాన్యం