రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కాపాడుకోవాలంటే తప్పకుండా శిరస్త్రాణం ధరించాలని పెద్దపల్లి ట్రాఫిక్ ఏసీపీ రామ్‌రెడ్డి పేర్కొన్నారు. జియో వారి సౌజన్యంతో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో శిరస్త్రాణం విశిష్టతపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
'ద్విచక్ర వాహనదారులు తప్పక శిరస్త్రాణం ధరించాలి' - latest news on Two-wheelers must wear helmets
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం విశిష్టతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
'ద్విచక్ర వాహనదారులు తప్పక శిరస్త్రాణం ధరించాలి'
ఈ సందర్భంగా ఏసీపీ రామ్‌రెడ్డి శిరస్త్రాణం ధరించి ద్విచక్ర వాహనం నడిపి వాహనదారులకు అవగాహన కల్పించారు. పలువురు ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా శిరస్త్రాణాలను పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా శిరస్త్రాణాలు ధరించాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి:అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!