తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగుండం పవర్​ ప్లాంట్​లో సాంకేతికలోపం

రామగుండం ఎన్టీపీసీ విద్యుత్​ పరిశ్రమలో సాంకేతికలోపం ఏర్పడింది. సుమారు 600 యూనిట్ల విద్యుత్ నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేపట్టిన అధికారులు మరో రెండురోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

ఎన్టీపీసీలో నిలిచిపోయిన విద్యుత్

By

Published : Mar 19, 2019, 12:19 PM IST

Updated : Mar 19, 2019, 3:35 PM IST

ఎన్టీపీసీలో నిలిచిపోయిన విద్యుత్
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోసాంకేతిక లోపంతో విద్యుత్ నిలిచిపోయింది. 4వ యూనిట్​లో బాయిలర్​ ట్యూబ్​ లీకేజీతో ఉత్పత్తి నిలిచిపోయింది. లోపాన్ని గుర్తించిన అధికారులు హుటాహుటిన మరమ్మతుపనులు చేపట్టారు. ఈ కారణంగా రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి జరగడంలేదు. మిగిలిన 5 యూనిట్లలో 1500 మెగావాట్ల వరకు విద్యుత్ వస్తోందని అధికారులు తెలిపారు.

మరో రెండు రోజులు...

లోపాన్ని సవరించేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వార్షిక లక్ష్యం చేరుకునే దశలో ఈ సమస్య వచ్చింది.

Last Updated : Mar 19, 2019, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details