పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాజపా కార్యాలయంలో ప్రధాని మోదీ రెండో దఫా తొలి ఏడాది పదవి కాలం పూర్తయిన సందర్భంగా పెద్దపెల్లి జిల్లా భాజపా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు.
మోదీ చాకచక్యం వల్లే...
గత ఐదేళ్ళ కాలంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను చూరగొన్న గొప్ప నేత మోదీ అని ఆయన కొనియాడారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న జమ్ము ప్రాంత సమస్యలను తీర్చడం సహా కేంద్రపాలిత ప్రాంతం చేయడం మోదీ అద్భుత మేధా శక్తికి నిదర్శనమని కీర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి లక్షల మంది మరణిస్తుంటే... మోదీ చాకచక్యం వల్ల 130 కోట్ల జనాభా గల దేశాన్ని నడిపిస్తోన్న తీరును ప్రపంచ దేశాలు అభినందించాయన్నారు.