తెలంగాణ

telangana

ETV Bharat / state

'భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించటమే లక్ష్యం'

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. ఇంటికి ఆరు మొక్కలు నాటి... వాటిని సంరక్షించాలని సూచించారు.

peddapally zp chairmen participated in harithahaaram program
'భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించటమే లక్ష్యం'

By

Published : Jun 27, 2020, 4:02 PM IST

భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధు తెలిపారు. జిల్లాలోని ముత్తారం మండలం మైదంబండ, పారుపల్లి, ముత్తారం గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం ఇంటికి ఆరు మొక్కలు నాటి... వాటిని సంరక్షించాలని చెబుతూ మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు.

రాష్ట్రంలో 80 శాతం మొక్కలు పెంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని చేపడితే... ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని జడ్పీఛైర్మన్ పుట్ట మధు కొనియాడారు.

ఇదీ చూడండి:ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details