దసరాలోగా అందుబాటులోకి పెద్దపల్లి కలెక్టరేట్
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 33 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణంలో ఇప్పటివరకు 30 కోట్ల పనులు పూర్తయ్యాయి.
దసరాలోగా అందుబాటులోకి పెద్దపల్లి కలెక్టరేట్
రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన పెద్దపల్లిలో కలెక్టరేట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. విద్యుత్ తీగల అమరిక, బండ పరిచే పనులు చురుగ్గా సాగుతున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ కలెక్టరేట్ భవనంలో దాదాపు 32 ప్రభుత్వ శాఖలు కొలువుదీరనున్నాయి. ఇప్పటికే 90 శాతం నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ భవనం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ దసరాలోగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
- ఇదీ చూడండి : 'నా అన్నలా చేయాలంటే ధైర్యం కావాలి'