తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రమ దోపిడి

పుట్టిన ప్రాంతంలో పనిలేక పస్తులుండే పరిస్థితి. జీవనోపాధి వెతుక్కుంటూ పొట్ట చేతపట్టుకుని పిల్లాపాపలతో సహా పొరుగు రాష్ట్రానికి వలసొచ్చారు. ఇక్కడ శ్రమ దోపిడితో సతమతమయ్యారు. ఎట్టకేలకు మానవహక్కుల సంఘం నేతల చొరవతో చెరనుంచి బయటపడ్డారు.

వలస వాసుల కష్టాలు

By

Published : Mar 1, 2019, 11:43 AM IST

Updated : Mar 1, 2019, 2:41 PM IST

వలస వాసుల కష్టాలు

నిత్యం వేలాది మంది ఉపాధి వెతుక్కుంటూ భాగ్యనగరానికి వలసొస్తారు. అలాగే ఒడిశా రాష్ట్రానికి చెందిన చాలామంది మంది బతుకు దెరువు కోసం రాష్ట్రానికి వచ్చారు. కొంతమంది పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీలో పనికి కుదిరారు. ఇలాంటి వారి కోసం అడిగేవారెవరూ ఉండరని వారితో బట్టీల యజమానులు రేయింబవళ్లు పనిచేయించేవారు. వారికి కనీస వసతులు కూడా కల్పించేవారు కాదు.
73 మందికి విముక్తి
యజమానుల వైఖరితో విసుగు చెందిన కూలీలు చివరకు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అధికారులు స్పందించి మంథని నియోజకవర్గంలోని కలవచర్లలోని బట్టీల్లో పనిచేస్తున్న 73 మందికి విముక్తి కల్పించారు. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి వారి స్వస్థలాలకు పంపించారు. పౌరహక్కుల నేతలకు కృతజ్ఞతలు చెప్పుకుని బతుకుజీవుడా అంటూ సొంతూళ్లకు పయనమయ్యారు.

Last Updated : Mar 1, 2019, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details