తెలంగాణ

telangana

ETV Bharat / state

అనిశాకు చిక్కిన అవినీతి ఇంజినీర్

పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించమన్నందుకు లంచం అడిగి ఏసీబీకి చిక్కాడు పెద్దపల్లి నీటిపారుదల డీఈ. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నిధులు విడుదలకు లక్ష రూపాయల లంచం అడిగి అనిశాకు పట్టుబడ్డాడు.

లంచం అడిగి అనిశాకు పట్టుబడిన ఇంజినీర్

By

Published : Jul 26, 2019, 11:11 PM IST

పెద్దపల్లి నీటిపారుదల శాఖ డీఈ రవికాంత్ బిల్లుల చెల్లింపుల విషయంలో గుత్తేదారుల వద్ద 80 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన గుత్తేదారు కావటి రాజు మూడో విడత మిషన్ కాకతీయ పథకంలో 5 పనులు పూర్తి చేశాడు. బిల్లుల చెల్లింపులో డీఈ రవికాంత్​ను గుత్తేదారు సంప్రదించాడు. బిల్లుల నిధులు చెల్లించాలంటే లక్ష రూపాయలు లంచం కావాలని రవికాంత్ డిమాండ్ చేశాడు. గుత్తేదారు రాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం బాధితుడు డీఈ డ్రైవర్​కు 80 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

లంచం అడిగి అనిశాకు పట్టుబడిన ఇంజినీర్

ABOUT THE AUTHOR

...view details