తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యానికి నిప్పంటించి అన్నదాతల నిరసన - ikp paddy buying centres

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తాలు పేరుతో రైస్​ మిల్లు నిర్వాహకులు కోత విధిస్తున్నారని అన్నదాతలు నిరసన చేపట్టారు. ధాన్యానికి నిప్పంటించి ఆందోళన చేపట్టారు.

Breaking News

By

Published : Apr 28, 2020, 12:07 AM IST

రైతుల నుంచి ఐకేపీ అధికారులు కొనుగోలు చేసిన ధాన్యంలో తాలు పేరుతో రైస్ మిల్లు నిర్వాహకులు కోత విధిస్తున్నారని ధాన్యంకు నిప్పంటించి రైతులు నిరసన చేపట్టారు. పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యంలో తాలు వస్తోందని రైస్​ మిల్లు యాజమాన్యం కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళన చేపట్టారు.

విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ ఐకేపీ కేంద్రంలో ధాన్యానికి అంటించిన మంటలను ఆర్పి వేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ఎఫెక్ట్​: పేద బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details