పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ దుకాణంపై జిల్లా వ్యవసాయ శాఖ, టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సోదాల్లో ప్రభుత్వ అనుమతి లేని గడ్డి మందులు పట్టుబడ్డాయి. దుకాణానికి సంబంధించిన మరో గోదాంలో నిల్వ ఉంచిన ఐదు కాటన్ల గడ్డి మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఫెర్టిలైజర్ దుకాణాలపై దాడులు... అనుమతిలేని గడ్డి మందులు సీజ్
పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో ప్రభుత్వ అనుమతిలేని గడ్డి మందులను అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.20 వేల విలువైన ఐదు కాటన్ల గడ్డి మందును అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
ఫెర్టిలైజర్ దుకాణాలపై దాడులు... అనుమతిలేని గడ్డి మందులు సీజ్
గడ్డి మందు విలువ సుమారు రూ. 20 వేలు ఉంటుందని తెలిపారు. టాస్క్ఫోర్స్ అధికారులు గడ్డి మందులను సీజ్ చేసి మంథని పోలీసులకు అప్పగించారు. వినియోగదారులను మోసం చేస్తూ అనుమతి లేని గడ్డి మందులను అమ్మితే అధికారులకు తెలపాలని రైతులకు సూచించారు. ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నిండుతునిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.