పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరంపల్లెలో మూడు రోజుల క్రితం మొతే మల్లారెడ్డి అనే వ్యక్తి మరణించాడు. మూడో దినం రోజు గ్రామస్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి, మద్యం సేవించే సందర్భంలో కొంతమంది మధ్య మాట మాట పెరిగి, తోపులాట జరిగింది. తిరుపతి రెడ్డి, వీరారెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మయ్య మద్యం మత్తులో ఒకరిపై ఒకరు బండరాళ్లతో దాడి చేసుకున్నారు. వీరిలో తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డి తలలకు తీవ్రం గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
నగరంపల్లెలో ఇరువర్గాల ఘర్షణ - conflict
పెద్దపల్లి జిల్లా నగరంపల్లెలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
గాయపడిన వ్యక్తి