తెలంగాణ

telangana

ETV Bharat / state

అంత్యక్రియల్లో తేనెటీగల దాడి.. మృతదేహాన్ని వదిలి పరుగులు

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిధిలో మరణించిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు చేస్తుండగా అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల భయానికి బంధువులు మృతదేహాన్ని వదిలి పరుగులు తీశారు.

bees attack on funeral in peddapalli district
అంత్యక్రియల్లో తేనెటీగల దాడి.. మృతదేహాన్ని వదిలి పరుగులు

By

Published : Jul 6, 2020, 10:53 AM IST

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలో మరణించిన ఓ వ్యక్తికి ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

అంతిమయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే.. తేనెటీగలు ఒక్కసారిగా మృతుడి బంధువుల మీద దాడి చేశాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో.. కుటుంబీకులు మృతదేహాన్ని వదిలి పరుగులు తీశారు. తేనెటీగలు వెళ్లిపోయిన తర్వాత తిరిగి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details