నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ అర్వింద్ ఇంటి ఎదుట జాతీయ యువజన కాంగ్రెస్ ఆదేశానుసారం జిల్లా అధ్యక్షుడు విక్కీ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీలో రైతులు చనిపోతున్నా... కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని విక్కీ యాదవ్ అన్నారు.
ఎంపీ అర్వింద్ ఇంటి ముందు యువజన కాంగ్రెస్ నిరసన - Telangana news
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి ముందు యువజన కాంగ్రెస్ నిరసన చేపట్టింది. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఎంపీ అర్వింద్ ఇంటి ముందు యువజన కాంగ్రెస్ నిరసన
రైతుల మద్దతుతో గెలిచిన ఎంపీ అర్వింద్... రైతు వ్యతిరేకిగా మారడం సిగ్గు చేటని మండిపడ్డారు. రైతుల సత్తా ఏంటో త్వరలోనే అర్థమయ్యేలా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం, ఉపాధ్యక్షుడు జైద్ బిన్, తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Jan 12, 2021, 4:45 PM IST