"సంచార జాతుల కులాలను బీసీలుగా గుర్తిస్తాం"
నిజామాబాద్ జిల్లాలోని తగ్గేల్లి, పెంటఖుర్దు గ్రామాల్లో రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ పర్యటించారు. సంచార జాతుల కులాలకు చెందిన వారిని బీసీలుగా గుర్తించడానికి పర్యటిస్తున్నామని తెలిపారు.
"సంచార జాతుల కులాలను బీసీలుగా గుర్తిస్తాం"
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని తగ్గేల్లి, పెంటఖుర్దు గ్రామాల్లో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పర్యటించారు. రాష్ట్రంలో సంచార జాతుల కులాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. 30 సంచార జాతులను గుర్తించి, వారికి కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి వారి ఆర్థిక స్థితి గతుల గురించి ఆయన ఆరా తీశారు.