Sankranti Pindi Vantalu in Nizamabad :సంక్రాంతి పండగ వచ్చిందంటే పాత కాలంలో చిన్నా పెద్ద అందరు కలిసి పిండి వంటలు తయారు చేసుకునే వారు. కానీ ప్రస్తుత సమాజంలో పండగ జరుపుకోవడానికే సమయం లేదు. దీంతో చాలా మంది రెడిమేడ్ పిండి వంటకాలపై ఆధారపడుతున్నారు. సంక్రాంతి పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. పండగ సందర్భంగా ఎక్కువగా మురుకులు, అరిసెలు, చెకోడీలు, గరిజెలు, సకినాలకు డిమాండ్ ఉందని నిర్వాహకులు తెలుపుతున్నారు.
పండగా అనగానే పిండి వంటకాలే గుర్తుకు వస్తాయి కానీ నిజామాబాద్ జిల్లాలో వీటితో పాటు ప్రత్యేకమైన తీపి వంటకం లభిస్తుంది. రాజస్థాన్ వాసులకు ప్రత్యకమైన ఘేవర్ అనే తీపి వంటకానికి సంక్రాంతి వేళ నిజామాబాద్‌లో మంచి డిమాండ్ ఉంది.సంక్రాంతి సమయంలో రాజస్థాన్‌లో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అందుకే అక్కడి వారు ప్రత్యేకంగా ఈ సీజన్లో ఘేవర్‌ను తయారు చేసి ఇక్కడికి పంపేవారు. క్రమంగా నిజామాబాద్‌లోనే అది లభించడంతో స్థానికుల ఆదరణను పొందింది. కేవలం సంక్రాంతికు వారం ముందు నుంచి తయారీ ప్రారంభించి సంక్రాంతి తర్వాత ఆపేస్తారు.
పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు - బోగి మంటల మధ్య విద్యార్థుల నృత్యాలు
'జాబ్‌లు చేస్తా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి సంక్రాంతి పండుగకు పిండి వంటలు వండుకోవడానికి కుదరదు. మీరు పిండి వంటలు బాగా చేస్తున్నారు. మీరు మంచిగా రుచికరంగా చేయబట్టే అన్ని రకాల పిండి వంటలను తినగలుగుతున్నామని అంటున్నారు. ఇప్పుడు నూవుల లడ్డులు చాలా తీసుకెళ్తున్నారు. సంక్రాంతి అంటే పిండి వంటల్లో స్పెషల్ అదే కాదా నూవుల లడ్డులు, నూవుల బూరెలు ఇలా అన్ని రకాల పిండి వంటలు సంక్రాంతి బాగా సేల్ అవుతున్నాయి.' -వ్యాపారులు