సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ సిబ్బందికి శానిటైజర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిత్యం ప్రజల శ్రేయస్సు కోరి సేవ చేస్తున్న వారికి తమ వంతుగా సాయం చేస్తున్నామని వారు తెలిపారు.
పోలీసులకు శానిటైజర్ బాటిళ్లు పంపిణీ - నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విధుల్లో ఉన్న 60మంది పోలీసులకు సేవ్ గ్లోబల్ ఫార్మర్ సభ్యులు శానిటైజర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ప్రజల శ్రేయస్సు కోరి రేయింబవళ్లు పనిచేస్తున్న రక్షకభటులకు తమ వంతు సాయంగా చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
పోలీసులకు శానిటైజర్ బాటిళ్లు పంపిణీ
పట్టణంలోని పోలీస్ స్టేషన్లలో, రోడ్లపై విధులు నిర్వహిస్తున్న దాదాపు 60 మంది పోలీస్ సిబ్బందికి శానిటైజర్ల డబ్బాలను సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సభ్యులు అందజేశారు. శానిటైజర్ల కొరత ఉన్న సమయంలో తమ శ్రేయస్సు కోరి వీటిని పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి:ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన