ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్, వర్ని, బాన్సువాడ ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల దళారులు పొలాల్లో వాలిపోయి పచ్చ ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొంటున్నారు.
వాతావరణం అనుకూలించక...
వాతావరణం అనుకూలించక కోసిన పంటను ఆరబెట్టుకోలేని పరిస్థితుల్లో రైతులు క్వింటాకు నాలుగు కేజీల తరుగును ఇస్తూనే రూ. 400 తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ. 1,860 ఉండగా రైతులు రూ. 1,350 నుంచి రూ. 1,400 వరకు దళారికి ఇచ్చేస్తున్నారు. ఇలా అమ్ముకోవడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
చేతికొచ్చిన పంట...