తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్దతు ధర ఇస్తేనే

నిజామాబాద్​ జిల్లాలో ఎర్రజొన్న, పసుపు రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్​తో శనివారం ఉదయం 11 గంటల నుంచి రహదారులపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చి గిట్టుబాటు ధరను ప్రకటించేవరకు ధర్నా కొనసాగుతుందని అన్నదాతలు స్పష్టం చేశారు.

ఎర్రజొన్న రైతుల ఆందోళన

By

Published : Feb 17, 2019, 6:08 AM IST

Updated : Feb 17, 2019, 9:31 AM IST

ఎర్రజొన్న రైతుల ఆందోళన
నిజామాబాద్​ జిల్లాలో మరోసారి ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన బాట పట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణా స్తంభించింది. నిరసనలతో జిల్లా హోరెత్తింది. క్వింటా ఎర్రజొన్నకు రూ.3500, పసుపు 15వేల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ.. జాతీయ రహదారిని దిగ్బంధించారు. పెర్కిట్, జక్రాన్​పల్లి, దర్పల్లిలో రైతులంతా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో అన్నదాతలు రోడ్లపైనే వంటలు చేసి భోజనాలు చేశారు.

పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళన చేయటం ఈనెలలో ఇది మూడోసారి. ఫిబ్రవరి 7, 12 తేదీల్లో ధర్నాలు చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల మళ్లీ రహదారులను ముట్టడించారు. ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని రైతులు వాపోయారు. రైతుల నిరసనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూశారు. ప్రభుత్వం దిగొచ్చి పంటలను మద్దతు ధరకు కొనేవరకు ఆందోళన కొనసాగుతుందని అన్నదాతలు స్పష్టం చేశారు.

Last Updated : Feb 17, 2019, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details