తెలంగాణ

telangana

'ప్రజా ప్రతినిధులు మీరే ఇలా ఉంటే... సామాన్యులు ఎలా పాటిస్తారు?'

By

Published : Jul 3, 2020, 1:14 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న సేవలను... ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ భాజపా కార్యకర్తలకు సూచించారు. విపత్కర పరిస్థితుల్లో మోదీ దేశ సైనికుడిలా పోరాడుతుంటే... కేసీఆర్ మాత్రం అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్నారంటూ ఆరోపించారు.

nizamabad-mp-arvind-kumar-serious-on-kcr-about-corona-issues
'ప్రజా ప్రతినిధులు మీరే ఇలా ఉంటే... సామాన్యులు ఎలా పాటిస్తారు?'

గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ వరకు పొడగించడంపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

''వలస కార్మికులకు ఇబ్బంది లేకుండా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకాన్ని మోదీ ప్రవేశపెట్టారు. గరీబ్​ కళ్యాణ్ యోజన పథకాన్ని నవంబర్​ వరకు పొడిగించారు. ఆయన దేశానికి చేస్తున్న సేవలను భాజపా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్​లాక్​ 2.0లో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటించాలి. కొండపోచమ్మ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు పడ్డారు. ప్రజలకు చెప్పే స్థాయిలో ఉన్న మీరే మాస్కులు ధరించకుండా ఉంటే... సామాన్యులు ఎలా పాటిస్తారు..? అప్పుడప్పుడు మోదీ ప్రసంగాలు వింటూ ఉండండి. ఆయనతో కలిసి ఉల్లాసంగా పనిచేసి కరోనాతో పోరాడదాం. విపత్కర పరిస్థితుల్లో దేశ సైనికుడిలా మోదీ పని చేస్తున్నారు. కేసీఆర్ మాత్రం అబద్ధాలతో ప్రజలను మరిపిస్తున్నారు.''

-ఎంపీ అర్వింద్

'ప్రజా ప్రతినిధులు మీరే ఇలా ఉంటే... సామాన్యులు ఎలా పాటిస్తారు?'

భాజపాపై తెరాస, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పనికిమాలినవి అంటూ ఎంపీ మండిపడ్డారు. కేంద్రం నిధుల మంజూరుపై మంత్రి ఈటల అవాస్తవాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:'ఈ యేడు అంతా ఇంట్లోనే బోనాల పండుగ చేసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details