ఈ గ్రామ ప్రజలకు మహాత్మాగాంధీ అంటే దైవంతో సమానం. ఊరి మధ్యలో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేసి ఆరాధిస్తుంటారు. జయంతి, వర్ధంతితో పాటు పండుగుల సమయంలో నివాళులర్పించి పూజిస్తారు. ఏ శుభకార్యం జరిగినా... మహాత్ముని విగ్రహానికి పూలమాలలతో పూజలు చేస్తారు. అది ఎక్కడో కాదు.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో.
పూజలు, అభిషేకాలు
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీని దైవంగా భావిస్తామని గ్రామస్థులు అంటున్నారు. ఊరిలో శుభకార్యలు, వివాహాలకు, సంతానం కలిగిన గాంధీ విగ్రహానికి అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి పూజిస్తారు. వర్షాల కోసం గ్రామ దేవతలకు అంతటా జలాభిషేకాలు చేస్తే... నర్సింగపూర్లో మాత్రం వర్షాల కోసం గాంధీకి జలాభిషేకం చేస్తారు.