పరిశుభ్రత పాటిస్తూ, అవసరమైన ముందు జాగ్రత్తలు చేపట్టి అంటువ్యాధులను పారదోలుదామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ నిల్వ ఉన్న నీటిని తొలగించాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తమ ఇంటి పరిసరాల్లోని నిలువ ఉన్న నీరు పారపోసి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని ప్రజలకు సూచించారు.
కేటీఆర్ పిలుపుతో ఫౌంటెన్ శుభ్రం చేసిన కలెక్టర్ కుటుంబం - nizamabad collector narayana reddy
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్ కలెక్టర్ కుటుంబం 'ప్రతి ఆదివారం 10 గంటలకు 10నిమిషాలు' కార్యక్రమంలో పాల్గొంది. కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంట్లోని ఫౌంటెన్ను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ సూచించారు.
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఫౌంటెన్ శుభ్రం చేసిన కలెక్టర్ కుటుంబం
సీజనల్ వ్యాధుల నివారణ కోసం పురపాలక శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపడుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఆయన తన నివాసంలోని ఫౌంటెన్లో ఉన్న నీటిని తీసేసి.. కుటుంబ సభ్యులతో కలిసి శుభ్రం చేశారు. 'మన ఇంటి పరిసరాలను మనమే శుభ్రం చేసుకుందాం.. దోమలను నివారిద్దాం' అని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు