నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీబీఐ మాజీ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దని... పరీక్షలంటే పండగల భావించాలని వాటి కోసం ఎదురు చూడాలని ఆయన తెలిపారు. మనిషి.. జీవితంలో నిరుత్సాహ పడకూడదు అని ఏదో ఒక సమయంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తామన్న పట్టుదలతో ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
'పరీక్షలంటే పండగలా భావించాలి' - సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ తాజా వార్త
నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ ప్రసంగించారు. జీవితంలో దేనిలోనూ నిరుత్సాహ పడకూడదని ఏదో ఒక సమయంలో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉండాలని సూచించారు.
'పరీక్షలంటే పండగలా భావించాలి'