ETV Bharat / state

అప్పు ఇవ్వలేదని.. స్నేహితుడిని చంపేశారు - latest crime news in jagtial district

అప్పు ఇవ్వడం లేదని.. నమ్మిన స్నేహితులే అతన్ని కడతేర్చారు. మద్యం తాగుదామని తీసుకెళ్లి.. మెల్లగా గొడవ మొదలు పెట్టారు. సీసాలతో పొడిచి చంపి తమ కోపాన్ని తీర్చుకున్నారు. ఈ దారుణం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

one person killed by friends in jagtial district
అప్పు ఇవ్వడం లేదని.. స్నేహితుడినే చంపేశారు
author img

By

Published : Dec 31, 2019, 5:37 PM IST

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం నర్సింహులపల్లెలో దారుణం చోటుచేసుకుంది. కల్లు దుకాణం సమీపంలో ఆర్మూర్‌ గంగాధర్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

గంగాధర్​ ఈ మధ్యే తన పొలాన్ని విక్రయించగా.. రూ. 5 లక్షలు వచ్చాయి. అప్పటి నుంచి గంగాధర్​ స్నేహితులైన నారాయణ, రవిలు అప్పు ఇవ్వమంటూ అడుగుతున్నారు. గంగాధర్ అప్పు ఇవ్వటానికి​ నిరాకరించాడు. ఈ కోపాన్ని మనసులో పెట్టుకున్న నారాయణ, రవి సమయం కోసం వేచి చూశారు.

సోమవారం రాత్రి గంగాధర్​ను మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మెల్లగా గొడవ మొదలుపెట్టి... తమ కోపాన్ని ప్రదర్శించారు. మద్యం సీసాలతో పొడిచి చంపారు.

రక్తపు మడుగుల్లో పడి ఉన్న గంగాధర్​ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు నారాయణ, రవి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ రాజేశ్​ వెల్లడించారు. గంగాధర్​కు భార్య, కొడుకు ఉన్నట్లు తెలిపారు.

అప్పు ఇవ్వడం లేదని.. స్నేహితుడినే చంపేశారు

ఇదీ చదవండి : మత్తు సూదిచ్చారు... ఆపరేషన్ ఆపేశారు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.