మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రి - minister indrakaran reddy
ఎస్సారెస్పీ ప్రాజెక్టును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తన మనవళ్లు, మనవరాళ్లతో కలిసి సందర్శించారు. ఆహ్లాదకర వాతావరణంలో పిల్లలతో సరదాగా గడిపారు.
మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. మంత్రి తన మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ప్రాజెక్టును తిలకించారు. అనంతరం డ్యాంపై కలియతిరుగుతూ తన మనవళ్లు, మనవరాళ్లకు ప్రాజెక్టు విశేషాలను వివరించారు. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో పిల్లలు, మంత్రి ఉత్సాహంగా గడిపారు.
ఇవీ చూడండి: మాపై దాడులను అరికట్టండి.. ఈటలతో వైద్యులు