తెలంగాణ

telangana

ETV Bharat / state

Lack Of Medical Facilities in Telangana University : వర్సిటీలో హెల్త్ సెంటర్ సరే.. మరి సదుపాయాల సంగతేంటి..? - తెలంగాణ వర్సిటీ విద్యార్థుల సమస్యలు

Lack Of Medical Facilities in Telangana University : సూది ఉంటే మందు లేదనే విధంగా తెలంగాణ విశ్వవిద్యాలయ హెల్త్ సెంటర్ మారింది.. కనీస సౌకర్యాలు లేకుండా నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి తెలంగాణ విశ్వ విద్యాలయం క్యాంపస్​లోని హెల్త్ సెంటర్​ను వర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి వెలవెల బోతుంది... వందలాది మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వసతులు, వైద్యులు, మాత్రలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Telangana University
Lack Of Medical Facilities in Telangana University

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 4:32 PM IST

Updated : Oct 15, 2023, 5:19 PM IST

Lack Of Medical Facilities in Telangana University వర్సిటీలో హెల్త్ సెంటర్ సరే.. మరి సదుపాయాల సంగతెంటీ.

Lack Of Medical Facilities in Telangana University : తెలంగాణ యూనివర్సిటీ (Telangana University)సమస్యలకు నిలయంగా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం హెల్త్ సెంటర్​ భవనాన్ని నిర్మించారు. హస్టల్లో హెల్త్ సెంటర్ లేదని విద్యార్థులు ధర్నాలు చేయగా.. గత సంవత్సరం వీసీ రవీందర్ గుప్తా ప్రారంభించి, డాక్టర్లను, సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్, వైద్య పరికరాలు అన్ని సమకూర్చారు.. కానీ ఇప్పుడు ఆ హెల్త్ కేర్ సెంటర్ వల్ల ఏం ఉపయోగం లేకుండా పోతోంది.

TU Hostel Problems : ఇదేందయ్యా ఇది.. హాస్టలా..? సమస్యల అడ్డానా..?

ఇంతమంది విద్యార్థులున్నవర్సిటీ క్యాంపస్​లోడాక్టర్ కేవలం రెండు గంటలే అందుబాటులో ఉంటారు. ఎప్పుడు వస్తాడు ఆ విషయం కూడా విద్యార్థులకు తెలియదు.. జ్వరం, కడుపునొప్పి, తలనొప్పి వచ్చినా మూడు కిలోమీటర్లు నడిచి డిచ్​పల్లి కానీ నిజామాబాద్​కు చార్జీలు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. రాత్రిళ్లు విద్యార్థులకు ఏదైనా సమస్య వస్తే.. వారిని పట్టించుకోవడానికి వైద్యులు అందుబాటులో ఉండరు. వారిని డిచ్​పల్లి లేదా నిజామాబాద్​కు తీసుకెళ్లాల్సిందే.

TU Students Problems : వర్సిటీ ఏర్పాటై పదహారేళ్లు అయినా... అభివృద్ధికి మాత్రం దూరం

విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కనీసం వర్సిటీలో అంబులెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు.. సమయానికి డ్రైవర్ ఉండడు.. అంబులెన్స్ కావాలన్నా రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవలని విద్యార్థులు అంటున్నారు.. కనీసం పారాసిటిమల్ టాబ్లెట్ కూడా లేని పరిస్థితుల్లో హెల్త్ కేర్ సెంటర్ ఉంది. ఫర్నీచర్ ఉన్నా వైద్యులు లేరు. అటవీ ప్రాంతంలో ఉన్నామని దోమలు, విష సర్పాలతో సావాసం చేస్తున్నామని.. వాతావరణ పరిస్థితులతో ప్రస్తుతం వైరల్ ఫీవర్​లతో బ్బందులు పడుతున్నామనివిద్యార్థులు వాపోతున్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన మాత్రలను అందుబాటులో ఉంచాలని విద్యార్థులు కోరుతున్నారు. డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు వస్తే విద్యార్థులు ఇంటి బాటపట్టాల్సిన అవసరం ఏర్పడింది.

"తెలంగాణ వర్సిటీలో ఎంతో మంది విద్యార్థులం ఉంటాం.. ఇక్కడ ఉన్న హెల్త్​సెంటర్​లో కనీస సదుపాయాలు లేవు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండడం లేదు. డ్రైవర్​కి ఫోన్ చేస్తే అక్కడ.. ఇక్కడ ఉన్నాం అంటున్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే మా సొంత ఛార్జీలు పెట్టుకోవాల్సి వస్తుంది. డాక్టర్ సరిగ్గా రావడం లేదు. సరిపడ నర్సులు లేరు. చిన్నపాటి వ్యాధులకు కూడా మందులు లేవు. మాకు అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం." - విద్యార్థులు

ఇప్పటికైనా విశ్వవిద్యాలయ అధికారులు తమపై దయవుంచి ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని 24 గంటల పాటు వైద్యుడు ఉండే విధంగా చూడాలని కోరారు. ల్యాబ్ టెక్నీషియన్, మందులు, అందుబాటులో ఉండే చొరవ చూపి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. ఎన్నోసార్లు ఈ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana University : క్రీడా బోర్డు ఓకే.. మరి వసతులేవి..?

Telangana University Sports Board Problems : స్పోర్ట్ బోర్డు ఓకే.. మరి వసతులేవి.. నిధులేవి..?

Last Updated : Oct 15, 2023, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details