తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరదనీరు.. దిగువకి విడుదల

శ్రీరాం సాగర్​ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకి ప్రాజెక్టుకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు.

heavy water flow to sri ram sagar project nijamabad district
శ్రీ రాం సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరదనీరు.. దిగువకి విడుదల

By

Published : Oct 12, 2020, 7:34 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్​కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వారం రోజుల క్రితం వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసి వేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకి తిరిగి వరద ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 64,943 క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వచ్చి చేరుతోంది.

ప్రస్తుతం ప్రాజెక్టులో 1091 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం కాగా.. వరద కాలువ ద్వారా 3,000 క్యూసెక్కులు, ప్రధాన గేట్ల ద్వారా 68,743 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

వరద కారణంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఇదీ చదవండి:'విచారణ పేరిట నిందితులకు కరెంట్​ షాక్​'

ABOUT THE AUTHOR

...view details