తెలంగాణ

telangana

దేవీమండపాల వద్ద అమ్మవారి చీరల వేలంపాట..

By

Published : Oct 26, 2020, 7:19 PM IST

తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో ధరించిన చీరలను నిజామాబాద్​లోని పలు ప్రాంతాల మండప నిర్వాహకులు వేలం ద్వారా భక్తులకు విక్రయించారు. వాటిని అమ్మవారి ఆశీర్వాదంగా.. తమకు మంచి జరుగుతుందనే విశ్వాసంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనపరిచారు.

goddess Durga Devi sarees auction in nizamabad district
దేవీమండపాల వద్ద అమ్మవారి చీరాల వేలంపాట..

నిజామాబాద్ పట్టణంలోని వాడవాడల్లో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో 11 రోజులపాటు వివిధ రూపాల్లో కొలిచారు. దేవీమాతను రోజుకొక్క రూపంలో ఆరాధించారు. కాగా అమ్మవారిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు అన్ని ఏర్పాటు పూర్తిచేసి.. కొన్నిచోట్ల నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్నారు.

కాగా ఆ జగన్మాత ధరించిన చీరలను మండప నిర్వాహకులు భక్తులకు వేలంపాట ద్వారా విక్రయిస్తున్నారు. తమకు మంచి జరగాలని, పిల్లాపాపలతో సంతోషంగా వుండే విధంగా చూడాలని ఆదిపరాశక్తిని వేడుకుంటూ భక్తులు ఆ చీరలను కొనుగోలు చేస్తున్నారు. అమ్మ దయతో కరోనా మహమ్మారి అంతం కావాలని ప్రార్థిస్తున్నారు.

ఇదీ చూడండి:కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం

ABOUT THE AUTHOR

...view details