ETV Bharat / state

YUVA : పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సందీప్‌ - 25వేలకు పైగా పలురకాల విత్తనాల సేకరణ - sandeep establish green environment

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 10:51 PM IST

Updated : Jul 4, 2024, 8:56 AM IST

Nalgonda sandeep gather various seeds : ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ అంటే అతనికి ప్రాణం మొక్కలను హరితాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. అతను చేస్తున్న పనిని చూసి స్నేహితులు సైతం స్వచ్ఛందంగా భాగస్వామ్యులయ్యారు. ప్రకృతిని పరిరక్షించి అడవులను పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఏమి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికులపై ప్రత్యేక కథనం.

Nalgonda sandeep gather various seeds
Nalgonda sandeep gather various seeds (ETV Bharat)

Nalgonda sandeep gather various seeds : పచ్చని ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే కానీ కొంత మంది మాత్రమే ఆ ప్రకృతిని కాపాడాలనుకుంటారు. పచ్చదనం కోసం పరితపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన యవకుడే సందీప్‌. ఇక్కడ తోటి మిత్రులతో కలసి విత్తనాలను సేకరిస్తున్న ఈ యవకుడి పేరు అవిరెండ్ల సందీప్‌ కుమార్‌. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పురపాలికలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తన్నాడు. పీజీ వరకు చదివిన సందీప్‌కి చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ ఎక్కువ. పర్యావరణ పరిరక్షణ కోసం ఎదో చేయాలని తపన.

దాని కోసం ఎక్కడ ఖాళీ ప్రాంతం కనిపించిన మెుక్కలు నాటేవాడు. మొక్కలు ఖర్చు పెరగడంతో చెట్ల నుంచి వచ్చే విత్తనాలు సేకరించడం ప్రారంభించాడు. అలా సేకరించిన విత్తనాలను వానాకాలంలో ఖాళీ ప్రదేశాలు, కొండ, గుట్ట ప్రాంతాల్లో వెదజల్లేవాడు. దీనికి స్నేహితులు సైతం మద్దతు పలికారు. అందరూ కలిసి గత ఐదేళ్లగా విత్తనాల సేకరించడం.. వాటిని నాటడం బాధ్యతగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 30వేలకు పైగా పలు రకాల విత్తనాలు సేకరించారు. అత్యధికంగా కానుగ, మామిడి, చింత, పొగడ, నేరేడు, కాసియా ఫిస్టులా, వేప, సపోట వంటి విత్తనాలును సేకరించి ఖాళీ ప్రదేశాల్లో చల్లుతున్నారు.

establish green environment : మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వీటన్నింటికి ప్రధాన కారణం ఎడాపెడా చెట్లు నరకడం విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగించడం. పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. చెట్ల పెంపకంతోనే భూ తాపాన్ని తగ్గించవచ్చనే ఉద్దేశంతో విత్తనాల సేకరించి వాటిని గుట్ట ప్రాంతాల్లో నాటితే చెట్లు పెరుగుతాయని భావించి విత్తనాల సేకరిస్తున్నట్లు ప్రకృతి ప్రేమికుడు సందీప్ చెబుతున్నాడు. పచ్చని అడవులు ఉంటేనే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కలకాలం పచ్చగా, ఆనందంగా జీవిస్తారని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని యజ్ఞంగా చేస్తున్నట్లు సందీప్ చెబుతున్నాడు. దీనికి స్నేహితులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారని చెబుతున్నాడు.

"మెుదట్లో సంచులు పట్టుకుని చెట్ల కింద విత్తనాలు ఏరుకుంటుంటే చాలా మంది హేళన చేశారు. అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగాం. తర్వాత తాము నాటిన విత్తనాలు మెుక్కలు రావడంతో పలువురు మెచ్చుకోవడంతో విమర్శించిన వాళ్లే అభినందిస్తున్నారు." -సందీప్‌ కుమార్‌, ప్రకృతి ప్రేమికుడు, మిర్యాలగూడ

Nalgonda Sandeep on Environmental Protection : ప్రస్తుతం వానాకాలంలో చల్లేందుకు లక్ష విత్తనాల సేకరణే లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. దీనికి స్నేహితులతో కలిసి రెండు నెలల క్రితం విత్తనాల సేకరణకు నడుం బిగించారు. ఇప్పటి వరకు 30వేలకు పైగా పలు రకాల విత్తనాలు సేకరించారు. అత్యధికంగా కానుగ, మామిడి, చింత, పొగడ, నేరేడు, కాసియా ఫిస్టులా, వేప, సపోట వంటి మొత్తం 25 రకాల విత్తనాలను సేకరించి ఖాళీ ప్రదేశాల్లో చల్లుతున్నారు. భావితరాలు పచ్చని ప్రకృతిలో ఆరోగ్యంగా జీవించాలనే లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని దీనిపై ప్రతి విద్యార్థుల నుంచి ప్రజాప్రతినిధులు వరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని సందీప్ చెబుతున్నారు.

తాము వేసేది విత్తనాలు కాదని భావితరాలకు భవిష్యత్తు అని సందీప్ మిత్రులు చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రకృతి రక్షణలో ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు. ప్రకృతిని సంరక్షించేందుకు ప్రజలందరూ భాగస్వామ్యలు కావాలని యవకులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిస్తున్నారు.

YUVA : తెలుగు సినిమా రంగంలో రాణిస్తున్న యువత - ఉద్యోగాలను వదిలేసి సినిమా వైపు ప్రయాణం

YUVA : ఆటలతో పాటు చదువులో సత్తా చాటుతున్న నల్గొండ యువతి - పీఈసెట్​లో టాప్ ర్యాంక్

Last Updated : Jul 4, 2024, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.