తెలంగాణ

telangana

ETV Bharat / state

అట్టుడికిన ఆర్మూర్

పంటకు మద్దకు ధర కావాలంటూ... రైతన్నలు రోడ్డెక్కారు. పొద్దుటి నుంచి రోడ్డును నిర్బంధించి ఆందోళన నిర్వహించారు. అధికారులు ఎంతకూ స్పందించకపోవడంతో మహాధర్నాకి పిలుపునిచ్చారు. ఫలితంగా పోలీసులు ఆర్మూర్ పట్టణంతో సహా 13 మండలాల్లో 144 సెక్షన్ విధించారు.

మద్ధతు ధరకై రైతన్న ఆగ్రహం...

By

Published : Feb 12, 2019, 10:02 PM IST

మద్ధతు ధరకై రైతన్న ఆగ్రహం...
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రావట్లేదంటూ రైతాంగం భగ్గుమంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లోని మామిడిపల్లి చౌరస్తాలో మద్దతు ధర పెంచాలంటూ రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ... అధికారులు మద్దతు ధర కల్పించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రజొన్న క్వింటాలుకి రూ.3500, పసుపు క్వింటాలుకి రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

మద్దతు ధర కోసం ఈ నెల 7న ధర్నా చేపడితే... న్యాయం చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ తమ వద్దకు రాలేదని మండిపడ్డారు. అధికారుల తీరు నిరసిస్తూ.. ధర్నాకి దిగామన్నారు. మద్దతు ధర కల్పించే వరకు తమ నిరసనలు ఆగవని స్పష్టం చేశారు.
పసుపు పండించేందుకు ఎకరాకు లక్షాయాభై వేల వరకు ఖర్చు వస్తే... పంట అమ్మితే కేవలం 80 వేలే వస్తున్నాయని చెప్తున్నారు.
రైతన్నలు రోజంతా జాతీయరహదారిని దిగ్బంధించారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతులు ముందుగానే మహాధర్నాకు పిలుపునిచ్చినప్పటికీ అధికారులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ధర్నాకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్మూర్ పట్టణం సహా 13 మండలాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.

ABOUT THE AUTHOR

...view details