ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట జూడాలు, వైద్యులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఈ ఉదయం 6 నుంచి 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేశారు. జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు సైతం బంద్ పాటించాయి. అత్యవసర సేవలనూ నిలిపివేశారు.
జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట వైద్యుల ఆందోళన
నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద జూడాలు, వైద్యులు ఆందోళన చేపట్టారు. నూతన ఎన్ఎంసీ బిల్లుతో వైద్యసేవల్లో నాణ్యత లోపిస్తుందని.. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎదుట వైద్యుల ఆందోళన