నిజమాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ తన నివాసంలో బోధన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, పరికరాల కొరత వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించడంపై సూపరింటెండెంట్ అన్నపూర్ణ, వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ ప్రభుత్వ దవాఖానాకు వచ్చే ప్రతి ఒక్క బాధితునికి సరైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
'ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ సరైన వైద్యం అందాలి' - bodhan news
బోధన్ ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతీ బాధితునికి సరైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ వైద్యాధికారులను ఆదేశించారు. తన నివాసంలో వైద్యులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి కావాల్సిన సామగ్రిని మంజూరు చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ను ఫోన్లో కోరారు. అన్ని శాఖలు ఆస్పత్రి వైద్యులకు సహకరించి కరోనాను రూపుమాపాలని కోరారు.
bodhan mla mahmmod shkeel ameer review on hospital facilities
ప్రభుత్వ ఆస్పత్రికి అవసరమైన వెంటిలేటర్లు మంజూరు చేయాలని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఫోన్లో విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కమిషనర్ వైద్య విధాన పరిషత్ ఫోన్లో మాట్లాడి ల్యాబ్‌కు సంబంధిచిన పరికరాలు సమకూర్చాలని కోరారు. ఆస్పత్రిలో బల్క్ సిలెండర్, సెంట్రల్ ఆక్సిజన్ అవసరమని వైద్యులు కోరగా.. సొంత ఖర్చుతో ఇప్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.