ప్రధాని నరేంద్ర మోదీకి సరితూగే నాయకుడు ఏ కూటమిలోనూ లేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్లో మార్చి 6న జరిగే అమిత్షా పర్యటన సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ క్లస్టర్ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులను ఆదుకోవడంలో తెరాస విఫలమైందని ఆరోపించారు.
'మోదీకి ఎదురులేదు' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనపై కమలనాథులు దృష్టిసారించారు. నిజామాబాద్లో కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు. అమిత్ షా పర్యటనపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ శ్రేణులు