ఇందూరు ప్రజలు కమలం గుర్తుకు ఓటేసి కేంద్రంలో మోదీని నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి గాను ధర్మపురి అర్వింద్‌ను గెలిపించాలని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం నుంచి కంఠేశ్వర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్ షోలో వందల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇందూరు పట్టణమంతా కాషాయ రంగుతో కళకళలాడింది. ఈ ఎన్నికలు రాష్ట్రం కోసం కాదని, దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని రాజా సింగ్ తెలిపారు. కేవలం మోదీ వల్లే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందన్నారు. తెరాస నాయకులు ఎమ్మెల్యేలకు, ప్రజలకు డబ్బులు ఎరగా వేసి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అవినీతి రహిత పాలన మోదీతోనే సాధ్యం'
"తెరాస నేతలు డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. అదే డబ్బులు ప్రజలకిచ్చి ఈ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తున్నారు. కానీ ప్రజలంతా దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి మోదీని గెలిపించాలని అనుకుంటున్నారు": రాజాసింగ్, భాజపా ఎమ్మెల్యే
'అవినీతి రహిత పాలన మోదీతోనే సాధ్యం'