నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిని అఖిలపక్షం నాయకలు సందర్శించారు. సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, తెదేపా, తెజస పార్టీ నేతలు వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, రోగులు, సహాయకులతో మాట్లాడి ఆసుపత్రిలోని సమస్యలను తెలుసుకున్నారు. 500 పడకలు కలిగిన ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం సగం పడకలు కూడా లేవని మండిపడ్డారు. రోగులకు సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల.. ఉన్నవారి మీదే పనిభారం పడి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందికి నెలల తరబడి వేతనాలు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.
'ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందిని పెంచాలి'
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందిని పెంచి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడి అరికట్టాలని నిజామాబాద్ జిల్లాలో అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సమస్యలను అధ్యయనం చేయడానికి సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, తెదేపా, తెజస పార్టీ ప్రతినిధుల బృందం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిని సందర్శించింది.
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సందర్శనలో అఖిలపక్షం
ఇదే అదనుగా భావించిన కార్పొరేట్ ఆసుపత్రులు సామాన్యుల నుంచి డబ్బు దండుకుంటున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా నేత రామకృష్ణ, తెజస నేత వెంకట్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి:ట్రంప్ నిషేధించినా ఆ వెబ్సైట్ నడిపిస్తాం!