తెలంగాణ

telangana

ETV Bharat / state

15 రోజుల శ్రమ.. చాక్‌పీస్‌లతో జాతీయ గీతం.. వాహ్!

ఓ కుర్రాడు చాక్‌ పీస్‌లతో జాతీయ గీతం రాశాడు. దానిలో ఏముంది అనుకుంటే పొరపాటే. చాక్ పీస్‌లను బ్లాక్ బోర్డుపై అక్షరాలుగా అతికించి జాతీయ గీతాన్ని బ్లాక్ బోర్డ్‌పై పరిచాడు. ఈ కుర్రాడి ప్రతిభకు స్థానికులు, జనాలు ఫిదా అవుతున్నారు.

DESHABHAKTHI
15 రోజుల శ్రమ.. చాక్‌పీస్‌లతో జాతీయ గీతం.. వాహ్!

By

Published : Jan 26, 2023, 5:18 PM IST

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకులు అట్టహాసంగా జరిగాయి. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన మధుకర్‌ వినూత్నంగా ఆలోచించి.. ఓ పని చేశాడు. అది ఏంటంటే చాక్ పీస్‌లను మనం రాయడానికి యూజ్ చేస్తాం. కానీ ఆ వ్యక్తి సుద్ధముక్కలనే అక్షరాలుగా చేసి జాతీయ గీతాన్ని బోర్డుపై పరిచాడు. ఒక్క తెలుగులోనే కాదు... హిందీ, ఆంగ్లం భాషల్లో బ్లాక్‌బోర్డులపై అతికించాడు.

తెలుగులో జాతీయ గీతం

ఇందుకోసం ఆయన 15 రోజులు శ్రమించినట్లు తెలిపాడు. చిత్రలేఖనం, వ్యర్థాలతో సుందర అలంకరణ ఒకేసారి రెండు చేతులతో రాయడం తదితర కళలను ప్రదర్శిస్తూ రాష్ట్రస్థాయిలో మధుకర్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనిని చూసిన స్థానికులు, స్నేహితులు మధుకర్‌ను అభినందిస్తున్నారు. ఇలాంటి చేస్తూ... అందరికి స్పూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.

అట్టముక్కపై జనగణమణ
అట్టముక్కపై చిత్రలేఖనం

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details