శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల అధికారులు ప్రాజెక్టులోని 40 గేట్లను ఎత్తి... నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీరాంసాగర్‌కు వరద ఉద్ధృతి... 40 గేట్లు ఎత్తివేత
ఎగువ నుంచి వస్తున్న వరద... రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో శ్రీరాం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. వరద ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా... అధికారులు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
40 gates open in sriram sagar project
ప్రాజెక్టు 96,577 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 1.50 లక్షల క్యుసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... 1090.60 అడుగులకు చేరుకుంది.