తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల నిర్బంధ తనిఖీలు

ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లో నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్​ రెడ్డి ఉదయం 100 మంది సిబ్బందితో కలసి చింబోలి గ్రామంలో తనిఖీలు చేపట్టారు.

పోలీసుల తనిఖీలు

By

Published : Mar 20, 2019, 12:29 PM IST

నిర్బంధ తనిఖీల్లో పాల్గొన్న పోలీసులు
ఎన్నికలు సమీపిస్తున్నందున పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలలోని చింబోలి గ్రామంలో సోదాలు జరిపారు. ఎస్పీ శశిధర్​ రాజు నేతృత్వంలో 100 మంది సిబ్బందితో ఉదయం 6 గంటల నుంచి ఇందులో పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

సమాచారమివ్వండి..

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి :"జవాన్లకు నివాళిగా హోలీ రద్దు"

ABOUT THE AUTHOR

...view details