విదేశాల నుంచి వచ్చిన వారు ఆరోగ్య పరీక్షలకు సహకరించాలని రాష్ట్ర దేవాదాయ, గృహ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఆయన సందర్శించారు. వసతులు, అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కరోనాతో ప్రపంచమంతా అల్లాడి పోతుందని.. అలాంటి వ్యాధి మన దగ్గర విస్తరించకుండా ఉండాలంటే ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ కాలేదన్నారు. ఇలాగే కొనసాగిస్తే అందరికీ శ్రేయస్కరమని పేర్కొన్నారు.