తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యటక అభివృద్ధికి కృషి చేస్తా: ఇంద్రకరణ్​ రెడ్డి

నిర్మల్ జిల్లాలో పర్యటక రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి మరింత అభివృద్ధి పరుస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని శ్యామ్​ఘడ్ కోట చుట్టూ రూ. 16.50 లక్షలతో ఏర్పాటు చేసిన లైటింగ్​ను ప్రారంభించారు.

minister indrakaran reddy inaugarated lights in nirmal district
పర్యటక అభివృద్ధికి కృషి చేస్తా: ఇంద్రకరణ్​ రెడ్డి

By

Published : Jan 1, 2021, 10:26 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్యామ్​ఘడ్ కోట చుట్టూ రూ. 16.50 లక్షలతో ఏర్పాటు చేసిన లైటింగ్​ను పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. నిమ్మ నాయుడు పాలనకు గుర్తుగా పురాతన కోటలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే కంచరోని చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

పురాతన సోన్ బ్రిడ్జిని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని పర్యటక శాఖ అధికారులకు సూచించారు. కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకోవడంలో అత్మనిర్భర్ పథకంలో నిర్మల్ మున్సిపాలిటీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం సంతోషకరమన్నారు. ఇందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు మంజులాపూర్​లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.

ఇదీ చదవండి:ఇళ్లకే పరిమితం... న్యూ ఇయర్ వేడుకలు మితం!

ABOUT THE AUTHOR

...view details