నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రం నుంచి గొల్లమాడ వరకు నిర్మించిన రోడ్డును రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా రూ. 5.74 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు మంత్రి వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తాం: ఇంద్రకరణ్ రెడ్డి - రహదారి పనుల పరీశీలించిన మంత్రి
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నిర్మించిన రహదారిని ఆయన పరిశీలించారు.
అంజనీ తండా, సాయి నగర్, తిమ్మాపూర్ గ్రామాలకు రహదారుల ఇబ్బందులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చాయన్నారు. త్వరలో సర్వే చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. ఆ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త వాటిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
తిమ్మాపూర్ కెనాల్ పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామయ్య, జడ్పీ కో-ఆప్షన్ సుభాశ్ రావు, ఎంపీపీలు రేఖ రమేశ్, అమృత చిన్నారెడ్డి, సర్పంచ్ రాంరెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ రమణారెడ్డి, ఎంపీటీసీ అనిల్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గంగారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.