రాష్ట్రంలోనూ తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వికాస్ హై స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. కరోనా వ్యాధి కలుగకుండా తీసుకోవాలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.
కరోనాపై విద్యార్థుల అవగాహన ర్యాలీ
రాష్ట్రంలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రహదారుల వద్ద ప్రయాణిస్తున్న ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు.
కరోనాపై విద్యార్థుల అవగాహన ర్యాలీ
పట్టణంలోని రహదారుల వద్ద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మాస్కులు పంపిణీ చేసి.. వారికి కరోనా వ్యాధి నివారణ చర్యలు, వ్యాధి లక్షణాలు, ఎలా వ్యాపిస్తుందనే విషయాలపై అవగాహన కల్పించారు.