కొవిడ్ బారిన పడిన పిల్లలను రక్షించడం మనందరి బాధ్యత అని నిర్మల్ జిల్లా బాలల పరిరక్షణ కమిటీ బాధ్యులు జన్ను అనిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన నారాయణ నెల రోజుల క్రితం కరోనాతో మృతి చెందారు. ఈ విషయం బాలల పరిరక్షణ కమిటీ సమాచారం అందింది. వారి కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించి... రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు.
corona:'కరోనా బారిన పిల్లలను రక్షించడం మనందరి బాధ్యత'
కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రక్షించడం మనందరి బాధ్యత అని బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు అన్నారు. కొవిడ్ మృతుడి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
నిత్యావసర సరుకులు, కరోనా
కరోనా కారణంగా అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేసిందని వివరించారు. సాయం కోసం 040 - 23733665, 1098 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి వి.మురళి, అంగన్వాడీ టీచర్ శశికళ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:SUICIDE: ఉదయం మూడు ముళ్లేసి.. రాత్రికి ఉరేసుకున్నాడు