నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన తాయప్ప కొంత కాలంగా గ్రామంలోని కాంట్రాక్ట్ పోల్స్ మరమ్మతులు చేసే వెంకటేష్ దగ్గర పని చేస్తున్నాడు. పనుల్లో భాగంగా ముస్లయిపల్లి గ్రామంలో విరిగిపోయిన స్తంభాల స్థలంలో... నూతన స్తంభాల పనులు చేపడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. లైన్మెన్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విరిగిపోయిన స్తంభాల స్థలంలో... నూతన స్తంభాల పనులు చేపడుతుండగా విద్యుత్‌షాక్‌తో మృతిచెందిన ఘటన మక్తల్‌లో చోటు చేసుకుంది. లైన్మెన్ నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగినట్లు స్థానికులు ఆరోపించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి